తిరుమలలో నేడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం కానుంది. 49 అంశాలుతో కూడిన అజెండాను అధికారులు రూపొందించారు. టేబుల్ ఐటెంగా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే రూ.3,171 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించనుంది. హుండీ ద్వారా వెయ్యి కోట్లు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ తీవ్రత తగ్గిన నేఫథ్యంలో దర్శన టికెట్లు పెంచడంతో పాటు ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై టీటీడీ నిర్ణయం తీసుకోనుంది.
230 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల హస్పిటల్ నిర్మాణం, గరుడా వారధికి 25 కోట్ల రూపాయల కేటాయింపుపై చర్చించనున్నారు. అంతేకాకుండా టీటీడీలో నూతన పీఆర్సీ విధానం అమలులోకి రానుంది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ మేరకు కామన్ గుడ్ ఫండ్ క్రింద 50 కోట్లు చెల్లింపు, చిన్నపిల్లల హస్పటల్ కి విరాళాల కోసం నూతనంగా అపన్న హృదయ స్కీం ప్రారంభించనున్నారు. శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీ అభివృద్దికి 3.9 కోట్లు కేటాయింపు, అలాగే తిరుపతిలో సైన్స్ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూములును టీటీడీ వెనక్కి తీసుకోనుంది.