మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సూచించారు.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా తెలిపిన ఆయన.. మహా వృక్షం లాంటి వైఎస్ ఫ్యామిలీలో వివేకా ఘటన అందరినీ షాక్‌లో నెట్టిందన్నారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద అండను కోల్పోయారన్న సజ్జల.. కానీ, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: COVID 19 AP: 500 దిగువకు పాజిటివ్ కేసులు
సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా జరగటమే కాదు జరుగుతోంది అనే నమ్మకం కూడా కలగాలి అన్నారు సజ్జల.. వైఎస్ హయాంలోనూ చంద్రబాబు.. వైఎస్ జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారన్న ఆయన.. దయ్యాల గుంపులాగా టీడీపీ మారిందని మండిపడ్డారు.. రాజకీయాలు అంటే మంచి పాలనకు సంబంధించి ఉండాలని కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు బాబువి దౌర్భాగ్యపు ఆలోచనలు అంటూ మండిపడ్డారు.. చంద్రబాబులాగే లోకేష్ కూడా పనికి రాకుండా తయారయ్యాడని విరుచుకుపడ్డారు. వివేకానందరెడ్డి కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని ఆరోపిస్తున్నారని.. సాక్ష్యాలను ఎవరూ తారుమారు చేయలేదన్నారు.. గుండెపోటు అని చెప్పినంత మాత్రాన అది దర్యాప్తును ఎలా ప్రభావితం చేస్తుందని ప్రశ్నించారు సజ్జల.. ఎదురుగా ఉన్న సాక్ష్యాలను సీబీఐ పరిగణలోకి తీసుకోదా? అని నిలదీశారు. చంద్రబాబుది కుట్రల స్వభావం అని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల.. నిజం నిప్పులాంటిది కాబట్టే చంద్రబాబు చేతులు కాలాయన్నారు.. అబద్ధానికి బట్టలు వేస్తే చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. ఇక, ఇప్పటికీ వైఎస్సార్ మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. మరోవైపు, ఎన్టీఆర్ మృతికి ఇండైరెక్ట్‌గా కారణమైన వ్యక్తం చంద్రబాబు అని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.