బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఆయన సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజులా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.. శ్రీశైలంలో శివలింగం పెకిలించారని సోము వీర్రాజు విమర్శిస్తున్నారు, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించండి అంటూ సవాల్ చేశారు… శ్రీశైలం అభివృద్ధి ఎవరి టైంలో జరిగిందో చర్చకు సిద్ధం..? సోము వీర్రాజు సిద్ధమా..? అంటూ ఛాలెంజ్ విసిరారు శిల్పా చక్రపాణి రెడ్డి..
Read Also: Reliance Jio: జియోకు భారీ షాక్..! యూజర్లు ఎంత పనిచేశారంటే..?
డబ్బులు వసూలు చేసిన రజాక్ పై పోలీసులు కేసు పెట్టి రిమాండ్‌కు పంపారు… చట్టం తనపని తాను చేస్తుందని సమాధానం ఇచ్చారు శిల్పా చక్రపాణి రెడ్డి.. తప్పు చేసినవాళ్లు నా పార్టీవాళ్లైనా.. ఎవరైనా శిక్ష తప్పదు అని స్పష్టం చేశారు.. ఇక, రాయలసీమను తక్కువచేసి మాట్లాడతావా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. 7 మంది సీఎంలను, పీఎంను, రాష్ట్రపతిని ఇచ్చిన సీమ మాది అని వెల్లడించారు… హిందూత్వం గురించి మాట్లాడుతున్నావు… మేం ఎన్నో ఆలయాలు కట్టించాం… ఎన్నో ఆలయాలకు విరాళాలు ఇచ్చాం అని పేర్కొన్నారు.. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసొచ్చినా సీఎం జగన్‌ను ఏమి చేయలేరు అని ప్రకటించారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.