మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ… రేయ్ కొడాలి.. ఎవడ్రా 420.. సీఎం జగన్.. మంత్రి కొడాలి నానిలే 420లు అంటూ వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబును 420 అంటారా..? కొడాలి నానినే 420 అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, రావి శోభనాద్రీశ్వరరావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిందెవర్రా కొడాలి..? అంటూ ప్రశ్నించిన ఆయన.. తెలుగు యువత పదవి ఇవ్వొద్దని చెప్పినా.. రావి శోభనాద్రీశ్వరరావు దయతో కొడాలి నాని తెలుగు యువత అధ్యక్షుడయ్యాడని.. తన కాళ్ల మీద పడుతున్నాడు.. ఏదో పైకి వస్తాడనే ఉద్దేశ్యంతో రావి శోభనాద్రీశ్వరరావు తెలుగు యువత పదవి ఇప్పించారని గుర్తుచేశారు.
Read Also: Revanth Reddy: పీఎం, సీఎం మేడారం జాతరకు ఎందుకు రాలేదు..?
మంత్రి పదవి కోసం జగన్ బూట్లు నాకితే నాకు.. అంతే కానీ చంద్రబాబును విమర్శిస్తావా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దేవినేని ఉమ.. నారా లోకేష్ పెళ్లికి చంద్రబాబు ఇంటి ముందు కొడాలి నాని తాటాకు పందిరి వేసిన రోజులు మరిచారా..? అని ప్రశ్నించిన ఆయన.. నువ్వు చేసిన పనులు మరిచావా.. దరిద్రుడా..? అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.. కేబినెట్‌లో ఉంటూ క్యాసినో ఆడించిన మంత్రి కొడాలి నాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దేవినేని ఉమ.. కొన్ని లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టు నుంచి తరలిస్తున్నారు అని ఆరోపించారు.. కొడాలి నాని, ద్వారంపూడి, విజయసాయి అల్లుడు కుమ్మక్కై కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారన్న ఆయన.. కాకినాడ పోర్టు నుంచి జరుగుతోన్న బియ్యం ఎగుమతులపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మర్డర్లు చేసి బ్యాలెన్స్‌డ్ అప్రోచుతో వెళ్లాలని సజ్జల ఎలా అంటారు..? అని ప్రశ్నించిన దేవినేని.. వైఎస్ వివేకా మరణం గుండెపోటు అని చెప్పిన విజయసాయిని సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు.