సినీ నటుడు అలీకి రాజ్యసభ ఛాన్స్ ఉందా? అధికారపార్టీ ఈక్వేషన్స్‌కు ఆయన సరిపోయారా? మరో పోస్ట్‌కు అలీ పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇంతకీ ఏంటా పదవి? అంతా రాజ్యసభ ఖాయం అనేసుకున్నారుఆ మధ్య సినీరంగ సమస్యలపై చిరంజీవి బృందంతో చర్చలు జరిగిన సమయంలో తళుక్కుమన్నారు నటుడు అలీ. అప్పుడే అలీ భుజంతట్టిన సీఎం జగన్ వచ్చేవారం కలుద్దాం అన్నారు. ముఖ్యమంత్రి అలా అన్నారో లేదో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం ఊపందుకుంది. అలీకి…
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా చనిపోవడం రాజకీయ వర్గాలను కలవరపరుస్తోంది. ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ పోస్ట్ కోవిడ్ పరిణామాలే హఠాన్మరణానికి కారణంగా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. దుబాయ్ టూర్ ముగించుకుని ఆదివారమే హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి గౌతమ్‌రెడ్డికి సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఇంట్లో ఉన్నవారు వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మంత్రి మృతి చెందారని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తండ్రి మేకపాటి రాజమోహన్…
వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లైఓవర్‌పై సజ్జల కాన్వాయ్ వాహనాలు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. సజ్జల సురక్షితంగా బయటపడ్డారు. ఓ వైసీపీ నేత నివాసంలో వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు…
మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ… రేయ్ కొడాలి.. ఎవడ్రా 420.. సీఎం జగన్.. మంత్రి కొడాలి నానిలే 420లు అంటూ వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబును 420 అంటారా..? కొడాలి నానినే 420 అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, రావి శోభనాద్రీశ్వరరావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిందెవర్రా కొడాలి..? అంటూ ప్రశ్నించిన ఆయన.. తెలుగు యువత పదవి ఇవ్వొద్దని చెప్పినా.. రావి శోభనాద్రీశ్వరరావు దయతో…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సూచించారు.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా తెలిపిన ఆయన.. మహా వృక్షం లాంటి వైఎస్ ఫ్యామిలీలో వివేకా ఘటన అందరినీ షాక్‌లో…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ ధరలు పెంచి వాతలు పెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు కోతలు కూడా మొదలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కరెంట్ ఉండడం లేదని, ఇంకా వేసవి రాకముందే విద్యుత్ కోతలు మొదలైపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 26 వేల కోట్లకు పైగా అప్పులు.. ఛార్జీలు…
సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్.. మూడేళ్లు పూర్తి కాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్ గా వున్న ఏపీని ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం,…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై వైసీపీ నేతలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. నెల్లూరును విడదీయవద్దని మేము ఎప్పుడో చెప్పామని, వైసీపీ నేతలు ఒక్కొరు ఒకో విధంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని కలిసే దమ్ము సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కానీ సంబరాలు చేసుకుంటున్నారని, కొందరు నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని…
పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైసీపీ నేతలు అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3.16లక్షల ఇళ్ళు కట్టి 2.62లక్షలు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచిందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఇచ్చి పేదలకు ఏటా 5లక్షల ఇళ్లు కడతానని జగన్ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, గత 3 ఏళ్లలో 15లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా జగన్ కేవలం 5…