సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్.. మూడేళ్లు పూర్తి కాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్ గా వున్న ఏపీని ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం, ఆంగ్ల పరిజ్ఞానం శూన్యమని జాతీయ నైపుణ్యాల నివేదిక-2022 వెల్లడించిందన్నారు.
తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు జగన్ గారూ..! అని లోకేష్ వ్యాఖ్యానించారు. ‘ఉద్యోగాల కల్పన అంటే మీ కుటుంబానికి, కులానికి నామినేటెడ్ పదవులు ఇచ్చినంత సులువు కాదు జగన్ రెడ్డి గారు’ అని ఆయన అన్నారు. ప్రఖ్యాత కంపెనీలు రప్పించాలంటే కియా వాళ్లని బెదిరించినంత ఈజీ కాదని, విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణమంటే ప్రజావేదిక కూల్చినంత సులువు కాదు ముఖ్యమంత్రి గారూ.. అంటూ ఆయన చురకలు అంటించారు.