మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సూచించారు.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా తెలిపిన ఆయన.. మహా వృక్షం లాంటి వైఎస్ ఫ్యామిలీలో వివేకా ఘటన అందరినీ షాక్లో…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ ధరలు పెంచి వాతలు పెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు కోతలు కూడా మొదలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కరెంట్ ఉండడం లేదని, ఇంకా వేసవి రాకముందే విద్యుత్ కోతలు మొదలైపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 26 వేల కోట్లకు పైగా అప్పులు.. ఛార్జీలు…
సీఎం జగన్పై మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా చేస్తానన్న జగన్.. మూడేళ్లు పూర్తి కాకుండా దేశమేం ఖర్మ, ప్రపంచమే మన రాష్ట్రం వైపు జాలిగా చూసేలా అధ్వానంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఉద్యోగావకాశాలకు నెంబర్ వన్ గా వున్న ఏపీని ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చిన జగన్ నెంబర్ సెవెన్ కి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా ఏపీ ఉద్యోగార్థుల్లో నైపుణ్యం,…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై వైసీపీ నేతలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. నెల్లూరును విడదీయవద్దని మేము ఎప్పుడో చెప్పామని, వైసీపీ నేతలు ఒక్కొరు ఒకో విధంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని కలిసే దమ్ము సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కానీ సంబరాలు చేసుకుంటున్నారని, కొందరు నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని…
పేదలకు దక్కాల్సిన ఇళ్లను కూడా వైసీపీ నేతలు అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3.16లక్షల ఇళ్ళు కట్టి 2.62లక్షలు ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంచిందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షల ఇచ్చి పేదలకు ఏటా 5లక్షల ఇళ్లు కడతానని జగన్ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, గత 3 ఏళ్లలో 15లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉండగా జగన్ కేవలం 5…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విదేశాలకు ఏపీ దాన్యం ఎగుమతి అవుతోందని.. కిలో రూ.25కే ప్రభుత్వం ఎగుమతి చేస్తోందని చంద్రబాబు తోక పత్రికలో రాశారని… రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఇలాంటి తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును సీఎం చేసేవరకు ఆయనకు తోకలుగా ఉన్న పార్టీలు, తపించే పత్రికలకు నిద్ర పట్టడం లేదని…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన… ఆయన సోము వీర్రాజు కాదు.. పిచ్చి వీర్రాజులా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.. శ్రీశైలంలో శివలింగం పెకిలించారని సోము వీర్రాజు విమర్శిస్తున్నారు, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించండి అంటూ సవాల్ చేశారు… శ్రీశైలం అభివృద్ధి ఎవరి టైంలో జరిగిందో చర్చకు సిద్ధం..? సోము వీర్రాజు సిద్ధమా..? అంటూ ఛాలెంజ్ విసిరారు శిల్పా చక్రపాణి…
నేడు విజయవాడలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్ర గడ్కరీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. నాయ్ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించనున్నారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజలు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించి, ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ, జగన్లు పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం…
తిరుమలలో నేడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలకమండలి సమావేశం కానుంది. 49 అంశాలుతో కూడిన అజెండాను అధికారులు రూపొందించారు. టేబుల్ ఐటెంగా మరికొన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే రూ.3,171 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్ను పాలకమండలి ఆమోదించనుంది. హుండీ ద్వారా వెయ్యి కోట్లు ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ తీవ్రత తగ్గిన నేఫథ్యంలో దర్శన టికెట్లు పెంచడంతో పాటు ఆర్జిత సేవలకు భక్తులును అనుమతించే అంశంపై టీటీడీ…