ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలు ట్విట్టర్ వేదిక విమర్శలు గుప్పించుకుంటునే ఉన్నారు. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టి 44 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు శుభాకాంక్షలు తెలుపుతూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పట్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు… కొంగర పట్టాభిరామ చౌదరిపై నెగ్గారు. చంద్రబాబు ప్రజాప్రస్థానంపై టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు.
‘ప్రజా జీవితంలో 44 ఏళ్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు గారికి అభినందనలు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే, చంద్రబాబు మరో 44 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉండాలనేది తన ఆకాంక్ష అని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా గల్లంతైతే ఇంట్లో కూర్చుని మనవడితో ఆడుకోవాలి అంటూ చంద్రబాబుపై వ్యంగ్యం ప్రదర్శించారు.