పేదలంటే సీఎం జగనుకు విద్వేషం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలు మంచి ఇళ్లల్లో ఉండటం సీఎం జగనుకు ఇష్టం లేదని, ఉగాది నాటికి ఎంతమంది పేదలను కొత్త ఇళ్లలోకి పంపుతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క పునాది కూడా తవ్వకుండా పేదలు కోరుకున్న ప్రభుత్వమే ఇల్లు కట్టించాలన్న 3వ ఆప్షన్ నుంచి వెనక్కి తగ్గుతున్నారన్నారు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టకపోగా, చంద్రబాబు…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నాయకులతో భేటీ అయిన ఆయన… వైసీపీ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పని చేయని నేతలను ఉపేక్షించేది లేదన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని గుర్తుచేశారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలు న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… హంద్రీనీవా ఆయకట్టు విషయంలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన ఆయన.. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలలో కాలువ కింద 20 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని.. కనీసం 50 రోజులు నీటి అవసరం ఉందని తన లేఖ ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు… హెచ్ఎల్సీ నుంచి జీబీసీ, ఇంద్రావతి డీప్ కట్ ద్వారా హంద్రీనీవాకి నీటిని మళ్లించే అవకాశం ఉందని… ఈ విధానంలో…
ఏపీ పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. అనంతరం ఆయన భౌతిక కాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడం చాలా బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఆయన వివాదాల జోలికి వెళ్లకుండా పనులు…
అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అక్కడ ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష చేయబోతున్నారా? పార్టీ.. ప్రభుత్వం లైన్ దాటి రాజకీయాలు చేస్తున్న వారి లెక్కలు తేల్చేస్తారా? ఈ బాధ్యతను పార్టీలో కీలక నేతకు అప్పగించడంతో శాసనసభ్యులు అలెర్ట్ అయ్యారా? ఎక్కడో.. ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం. అంతర్గతంగా నాయకత్వం మధ్య అనైక్యత పెరుగుతోందా?ఉత్తరాంధ్ర జిల్లాలు రాజకీయ పార్టీల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయి. ఇక్కడ సమీకరణాలు.. సీట్లు.. ఓట్లు అధికార-విపక్షాలకు అత్యంత కీలకం. ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాల్లో టీడీపీదే హవా.…
సినీ నటుడు అలీకి రాజ్యసభ ఛాన్స్ ఉందా? అధికారపార్టీ ఈక్వేషన్స్‌కు ఆయన సరిపోయారా? మరో పోస్ట్‌కు అలీ పేరును పరిశీలిస్తున్నారన్న ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇంతకీ ఏంటా పదవి? అంతా రాజ్యసభ ఖాయం అనేసుకున్నారుఆ మధ్య సినీరంగ సమస్యలపై చిరంజీవి బృందంతో చర్చలు జరిగిన సమయంలో తళుక్కుమన్నారు నటుడు అలీ. అప్పుడే అలీ భుజంతట్టిన సీఎం జగన్ వచ్చేవారం కలుద్దాం అన్నారు. ముఖ్యమంత్రి అలా అన్నారో లేదో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ప్రచారం ఊపందుకుంది. అలీకి…
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా చనిపోవడం రాజకీయ వర్గాలను కలవరపరుస్తోంది. ఆయన ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఈ పోస్ట్ కోవిడ్ పరిణామాలే హఠాన్మరణానికి కారణంగా వైద్యవర్గాలు భావిస్తున్నాయి. దుబాయ్ టూర్ ముగించుకుని ఆదివారమే హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి గౌతమ్‌రెడ్డికి సోమవారం ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో ఇంట్లో ఉన్నవారు వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మంత్రి మృతి చెందారని అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తండ్రి మేకపాటి రాజమోహన్…
వైసీపీ ముఖ్య నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ కాలేజీ వద్ద ఫ్లైఓవర్‌పై సజ్జల కాన్వాయ్ వాహనాలు వెళ్తుండగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో సజ్జల కాన్వాయ్ వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా.. సజ్జల సురక్షితంగా బయటపడ్డారు. ఓ వైసీపీ నేత నివాసంలో వివాహానికి హాజరై సజ్జల తిరిగి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కర్నూలులోని డోన్ రోడ్డులో శనివారం పత్తికొండకు…
మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ… రేయ్ కొడాలి.. ఎవడ్రా 420.. సీఎం జగన్.. మంత్రి కొడాలి నానిలే 420లు అంటూ వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబును 420 అంటారా..? కొడాలి నానినే 420 అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, రావి శోభనాద్రీశ్వరరావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిందెవర్రా కొడాలి..? అంటూ ప్రశ్నించిన ఆయన.. తెలుగు యువత పదవి ఇవ్వొద్దని చెప్పినా.. రావి శోభనాద్రీశ్వరరావు దయతో…