మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ వార్తలు వచ్చాయి. దాన్ని ఆరోజే ఖండించాను. మాపై ఇలాంటివి రాసిన వారిపై పరువునష్టం దావా వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం ఆలోచన ప్రకారమే పదవులు ఇస్తారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ నేను పాకులాడలేదు. ఆరోజు చెప్పగానే 24 మంది రాజీనామా చేశాం. మంత్రి పదవి లేనప్పుడు కొంచెం ఫీల్ అవటం ఎవరికైనా ఉంటుందన్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు. నేను వైయస్సార్ ఫ్యామిలీ…
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి వైదొలగాల్సి వచ్చినవారు ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. పదవి ఆశించి నిరాశకు గురైనవారు అలకబూనారు.. అయితే, మంత్రి పదవి దక్కినవారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. తొలిసారి మంత్రివర్గంలో అడుగుపెట్టిన ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. ఇదే సమయంలో.. గతంలో హోంమంత్రిగా మహిళే ఉండడంతో.. ఇప్పుడు కూడా ఆ పదవి మహిళకే ఇస్తారని.. కాబోయే హోంమంత్రి ఆర్కే రోజాయే అంటూ ప్రచారం సాగుతోంది.. రోజాకే హోంమంత్రి పదవి ఇవ్వాలంటూ…
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో చోటు దక్కినవారు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు పదవి కోల్పోయినవారు, ఈసారైనా మంత్రి పదవి వస్తుందని ఆశించి నిరాశకు గురైనవారు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కేబినెట్ కూర్పులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాలినేని శ్రీనివాస్రెడ్డి.. వైసీపీపై ఆయన అలకబూనారు.. ఇక, అలిగిన బాలినేనిని బుజ్జగించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేయడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. బాలినేని ఇంటికి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.. అయితే,…
ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులు ఎవరు అనే దానికి తెరపడింది.. అయితే, అక్కడక్కడ అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.. ఒకరు ఏకంగా రాజనీమాకు సిద్ధపడినట్టు తెలుస్తుండగా.. మరోసారి అవకాశం రాలేదనే అసంతృప్తి వ్యక్తంచేసేవారు లేకపోలేదు.. ఈ నేపథ్యంలో.. కేబినెట్లో కొత్తగా అవకాశం దక్కి.. కాసేపట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మంత్రి పదవి రావటం సంతోషంగా ఉందన్నారు.. అయితే, ఆశించిన తర్వాత పదవి దక్కలేదని కొంత మందికి…
ఆర్ కె. రోజా..నగరి ఎమ్మెల్యేగా వున్న రోజాకు మంత్రిపదవి గ్యారంటీ అంటున్నారు. జగన్ కేబినెట్లో చివరి నిమిషంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఊహించిన విధంగా పాత మంత్రులకు 10 మందికి అవకాశం దక్కగా..కొత్తగా 15 మందిని ఎంపిక చేసారు. అందులోనూ చిత్తూరు జిల్లా నుంచి ఫైర్ బ్రాండ్ కి బెర్త్ కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. జాబితాలో ఆమె పేరు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి మూడో మంత్రిగా రోజాకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో…
ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.…
ఈ నెల 11వ తేదీన కొత్త కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. కొత్త మంత్రుల ఎంపికపై సీఎం జగన్ తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు.. జిల్లాలు, సామాజిక సమీకరణలు, మహిళలు.. ఇలా అన్ని బేరీజు చేసేపనిలో ఉన్నారు.. అందరికీ మంత్రి పదవి కావాలని ఉన్నా.. అందరూ అధినేతపైనే భారం వేస్తున్నారు.. ఆశగా ఎదురుచూస్తున్నారు.. కేబినెట్ కూర్పు గురించి స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు… కేబినెట్ కూర్పు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం అన్నారు.. అసంతృప్తి అనే ప్రశ్నే…
మంత్రులంతా రాజీనామా చేశారు.. ఇవాళో రేపో కొత్త మంత్రులను ఫైనల్ చేయనున్నారు.. దీనిపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.. అయితే, ఆశావహులంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.. ఈ విషయంపై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… మంత్రివర్గంలో నాకు స్థానం ఉంటుందా లేదా అన్నది నాకు తెలియదు… కానీ, ఆశావహుల జాబితాలో నేను ఉన్నాను అన్నారు.. మంత్రి…
విద్యుత్ సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే కారణం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్కు సబ్సిడీ ఇచ్చినా వాడుకోలేకపోయారని దుయ్యబట్టారు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నామని.. 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక, పోలవరం గురించి మాట్లాడే నైతిక…