టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… మతి భ్రమించిన చంద్రబాబు.. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారు.. అందుకే చంద్రబాబుకు తెలివి తేటలు, శక్తిసామర్థ్యాలు కావాలంట.. దుర్గమ్మవారిని అవే కోరుకున్నట్లు ఆయనే చెప్పారు.. మరి ఇన్నాళ్లూ అవి లేవా? ఉంటే వాటిని కోల్పోయారా..? అంటూ ఎద్దేవా చేశారు. మంచి మనసు, ఆలోచన ఉంటే అన్నీ బాగుంటాయి.. కానీ, చంద్రబాబుకు అవేవీ లేకుండా పోయాయన్న ఆయన.. చంద్రబాబు ఒక ఉన్మాదిలా మారి బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా సీఎంను నిందిస్తున్నారు.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Lightning Strike: ఉరుములు, మెరుపులతో వర్షం.. పిడుగుపాటుకు నలుగురు బలి
పోలవరం పాపం పూర్తిగా చంద్రబాబుదే అన్నారు సజ్జల.. రైతుల శ్రేయస్సు కోసం చంద్రబాబా మాట్లాడేది..? అంటూ సెటైర్లు వేసిన ఆయన.. వైయస్సార్‌సీపీకి ఉరి వేయాలంటూ చంద్రబాబు వాగుతున్నారని.. గతి తప్పిన చంద్రబాబు ఇంకా రాజకీయాల్లో ఉండాలా? అని ఫైర్ అయ్యారు. విషం కక్కడమే చంద్రబాబు పని.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ కూలిపోయిందని, తద్వారా ప్రభుత్వంపై రూ.800 కోట్ల భారం వేశారన్నారు. తన హయాంలో చేసిన అక్రమాల ఫలితమే ఆ డయాఫ్రమ్ వాల్ కూలిపోవడమన్న ఆయన..మళ్లీ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే మళ్లీ నీళ్లు తోడాలి.. ఎలా కట్టాలో కూడా నిపుణులకు అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే చంద్రబాబు ఆ పనులను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు సజ్జల.. ఒంగోలులో ఆర్టీఏ ఘటనలో చంద్రబాబు నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.. ఎవరైనా అమ్మాయిని తీసుకు రమ్మంటే ఇంట్లో నుంచి లాక్కుని వస్తారా? అని పోలుస్తూ మాట్లాడడం అతి దారుణం అన్నారు. ఎవరో కింద ఉద్యోగి చేసిన తప్పిదాన్ని, పెద్దగా చూపి, రాష్ట్రంలో ఏదో జరిగినట్లు చెప్పడం అత్యంత దారుణమైన విషయం అని.. తాను ఒక మాజీ సీఎం అనే విషయం కూడా చంద్రబాబు మర్చిపోతున్నారు అని విమర్శలు గుప్పించారు సజ్జల రామకృష్ణారెడ్డి.