చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం దౌర్భాగ్యమంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తిప్పికొట్టారు. ఏపీకి జగన్ లాంటి సీఎం ఉండటమే రాష్ట్రానికి దౌర్భాగ్యమని ఆయన రివర్స్ పంచ్ ఇచ్చారు. వైసీపీ ఎంపీలు చెప్పిన్నట్లు జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే రాష్ట్రానికి మంచిదన్నారు. ప్రధాన మంత్రిని కలిసిన సీఎం జగన్ ఏం అడిగారని ప్రశ్నిస్తే.. తమను, తమ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీలు దూషిస్తున్నారని, తిట్టడమే వారి పనిగా పెట్టుకున్నారని…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మధ్య దూకుడు పెంచారు.. ఓవైపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించిన ఆయన.. పాత మంత్రుల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఎవ్వరికి పార్టీ బాధ్యతలు అప్పగించాలి.. కొత్తవారు ఎవరైనా మంత్రులుగా బెటర్, సామాజిక సమీకరణలతో ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనే విషయాలపై కసరత్తు చేస్తున్నారు.. మరోవైపు ప్రత్యర్థులపై పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. గత రెండ్రోజులు నుంచి బహిరంగ సభల్లో విమర్శల ధోరణి మార్చారు. హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత విపక్ష…
విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస ప్రాజెక్ట్ వద్ద బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం కోసం రోజూ ముఖ్యమంత్రి వెళ్లి 55 వేల కోట్లు ఇచ్చేయండి అంటూ మోర పెట్టుకుంటున్నారని, ముఖ్యమంత్రికి ఉత్తరాంద్రా ప్రాజెక్ట్‌లు గుర్తుండటంలేదా అని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ కి దమ్ము, ధైర్యం, ప్రేమ ఉంటే ఉత్తరాంధ్ర…
ఏపీ సీఎం జగన్ కొత్త కేబినెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రులంతా రాజీనామాలు చేసారు. కొత్త మంత్రి వర్గం ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనుంది. అందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ కొత్త మంత్రులు ఎవరు అన్న అంశంపై హాట్ హాట్ గా ఏపీ రాజకీయాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈసారి కొత్త ముఖాలకు బాగానే చాన్సులు దొరికే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తో…
విశాఖపట్నం ఎన్సీసీ భూముల వివాదంలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ నాయకులు, కొన్ని మీడియా సంస్థలపై ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే ఎన్సీసీ భూముల లావాదేవీలు జరిగాయని, తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా..? అని ఆయన ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని ఎన్సీసీ కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు నాయుడే అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆల్జీ మర్స్ తో బాధ…
గత బుధవారం పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతు ఓ హస్పిటల్‌పై ఫ్లెక్సీలు కట్టారు. అయితే స్వాగతం పలుకుతూ కట్టిన ఫ్లెక్సీని టీడీపీ ఇన్ ఛార్జ్ చదలవాడ అరవిందబాబు తమ్ముడు హాస్పిటల్ పై ఏర్పాటు చేయడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.. ఫ్లెక్సీ తొలగింపును తప్పు పట్టారు. అనుమతి తీసుకునే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినప్పటికీ ఫ్లెక్సీలను టీడీపీ…
మరోసారి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. ‘గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా?.. వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ జగన్ రెడ్డి గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో…
అమరావతి: మంత్రిగా తన చివరి మీడియా సమావేశంలో పేర్ని నాని పలు విషయాలపై చర్చించారు. అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్ని నాని తెలిపారు. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలే మారిపోయినట్లు వెల్లడించారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చేరాలంటే ఆలోచించేవాళ్లు అని.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతున్న ఘటనలు చూస్తున్నామన్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్…
విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గ్రామ, వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా.. ఈ దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అని పేర్కొన్న సీఎం జగన్.. గతంలో దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని…
మరికాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఇక, ముగ్గురు, నలుగురు మినహాయిస్తే కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.. ఎవరు ఉంటారు.. ఎవరు కేబినెట్ నుంచి పార్టీ బాధ్యతల్లోకి వెళ్లినున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి ఆదిమూలపు సురేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం నా తల కోసుకోవటానికి కూడా సిద్ధం అని ప్రకటించారు.. ముఖ్యమంత్రివి ఉన్నత ప్రమాణాలు.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని…