ఈ మూడేళ్లలో సంతృప్తికరంగా పని చేశాను.. సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ పని ఇచ్చినా సమర్థవంతంగా పనిచేస్తానని తెలిపారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… ఇవాళే ఏపీలో పాత మంత్రులంతా రాజీనామా చేస్తారని తెలుస్తోన్న తరుణంలో.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే 90 శాతం మంత్రులను మారుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారని.. ఆ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం అయ్యిందన్నారు.. ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న…
ఆంధ్రప్రదేశ్లో మంత్రులపై చర్చ జరుగుతోన్న సమయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా దిగిపోతున్నానని, తన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు.. గతంలో తమ్ముడు ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడు… నరసన్నపేట ఉపఎన్నికలో తనపై మరో సోదరుడు రామదాసును బరిలోకి దించాడని.. ఆ ధర్మ యుద్ధంలో తానే గెలిచానని కృష్ణదాస్ గుర్తుచేసుకున్నారు.. 2019 ఎన్నికల్లో తమ్ముడు ప్రసాదరావు కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు.. ఎన్నికల్లో ఇద్దరం గెలిచామని చెప్పారు.…
ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉండేది ఎవరు..? ఊడేది ఎవరు..? కొత్తగా వచ్చేది ఎవరు..? ఎవరికి ఏ శాఖ..? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, మా తలరాతలు మార్చేది సీఎం జగనే అన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… ఇన్నాళ్లూ మంత్రిగా చేయడం నా అదృష్టంగా తెలిపారు.. రాజీనామా చేయమని సీఎం జగన్ ఆదేశిస్తే.. ఆయన కాళ్ల ముందు తల వంచి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మళ్లీ మంత్రిగా అవకాశం కల్పిస్తారనే…
ఏపీలో ఇప్పుడంతా కేబినెట్ మార్పుల గురించే చర్చించుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఎన్టీవీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ సీఎం జగన్ ఆలోచన ప్రకారం జరుగుతుంది. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిందే అన్నారు. మంత్రివర్గ మార్పులు.. చేర్పులపై ఎవరికీ క్లారిటీ లేదు. సీఎం జగన్ ఏ రోజు చెబితే ఆ రోజు రాజీనామాలు చేసేందుకు మంత్రులందరూ సిద్ధంగా వున్నామన్నారు. సీఎం జగన్ నూతన మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరుండాలని నిర్ణయిస్తే వారే ఉంటారు. జనసేన…
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నేత దేవినేని చందు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక రోజుకో సమస్య సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఉన్నంత కాలం విద్యుత్ చార్జీ పెంచలేదని, స్లాబ్ రేట్ 1.90 పైసలు పెంచి ప్రజలపై…
శుభకృత్ నామ ఉగాది సందర్భంగా సరికొత్త ఆశలతో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా కొత్త గెజిట్ రూపొందించింది. కొత్త జిల్లాల పాలనకు అనుగుణంగా కలెక్టర్లు, ఎస్పీలను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు కలెక్టర్ల నియామకం జరిగింది. సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి, విశాఖ జిల్లా కలెక్టర్ గా మల్లికార్జున, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బాలాజీ రావుని నియమించారు. విజయనగరం…
సింహం సింగిల్గానే వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయంటూ విపక్షాలపై సెటైర్లు వేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబుగాంలో సచివాలయాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ పొత్తు లేకుండా ఎన్నికల్లో గెలవగలదా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం పార్టీని సింగిల్గా పోటీచేయమని చెప్పండి.. చంద్రబాబు, లోకేష్, అచ్చెంనాయుడు.. తాము ఒంటరిగా పోటీచేస్తామని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు.. ఇక, వారు పొత్తు ఉండదని చెప్పలేరన్న ఆయన.. అంతా కలసి మాపై…
జేసీ బ్రదర్స్ అంటేనే సంచలన వ్యాఖ్యలకు మారుపేరు.. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తుంటారు.. అయితే, కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఆగ్రహానికి గురైన ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష కూడా ఖరారు అయ్యింది.. క్షమాపణలు చెప్పడంతో ఆ శిక్షలను సేవగా మార్చేసింది హైకోర్టు.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఐఏఎస్లు, ఐపీఎస్లు సహా అందరూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారన్న…
ఇటీవల ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. దీంతో అక్కడికక్కడే బేషరతుగా ఐఏఎస్ అధికారులు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో సేవాల కార్యక్రమాలు చేయాలని తీర్పును సవరించింది. అయితే ప్రస్తుతం ఏపీలో ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడం దేశ…
ఆంధ్రప్రదేశ్లో జాబ్ మేళాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు మెగా జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.. దీనికి సంబంధించిన తేదీలను ప్రకటించారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఏప్రిల్ 16, 17 తేదీల్లో తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా ఉంటుందని.. కనీసం 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానుల కోసమే ఈ…