ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది… ఈ సారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.. అయితే, రాజధాని విషయంలో బీజేపీ స్టాండ్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులు బిల్లు తెస్తారన్నారు.. అయితే, అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలి అని బీజేపీ స్పష్టంగా చెబుతోందని మరోసారి గుర్తుకు చేశారు.. మూడు…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి.. దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనేది అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.. ఇక, చివరిసారిగా జులై 19 నుంచి ఐదురోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.. అయితే, ఈ సారి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలకు రావాలి కోరారు ప్రభుత్వ చీఫ్ విప్…
Thopudurthi Prakash Reddy: టీడీపీ నేతలకు రాప్తాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సవాల్ చేశారు. తనపై ఐ-టీడీపీ, చైతన్య రథం అనే ఈ పేపర్ ద్వారా గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను హత్యలు చేయించానని రాశారని.. దీనిపై సీఐడీ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై డీఐజీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాజారాం, ఈశ్వరయ్య అనే వ్యక్తులను తాను చంపానని రాశారని.. కానీ వారు బ్రతికే ఉన్నారని తోపుదుర్తి…
Deputy CM Narayana Swamy: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కుప్పంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 40వేల దొంగ ఓట్లతోనే చంద్రబాబు కుప్పంలో గెలుస్తూ వచ్చాడని ఆరోపించారు. బీసీల ఓట్లతో కుప్పంలో గెలిచి చంద్రబాబు వారికి చేసిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ జెండా ఎగరాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పిలుపునిచ్చారు. కుప్పం ప్రజలు నాన్ లోకల్ అయిన చంద్రబాబును ఈ దఫా…
YSRCP: 2024 ఎన్నికల్లోనూ గెలవాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత పటిష్టం చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో పార్టీ పటిష్టతపై హైకమాండ్ దృష్టి సారించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. పరిశీలకుల జాబితాపై పార్టీ కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఈ జాబితా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అదనంగా పరిశీలకుడు ఉంటాడని తెలుస్తోంది. నియోజకవర్గ నేతలకు, పార్టీకి అనుసంధాన కర్తగా…
VijayaSaiReddy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ గత ఏడాది డిసెంబర్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ మూవీ అనూహ్య వసూళ్లను సొంతం చేసుకుంది. తాజాగా బెంగళూరులో జరిగిన సైమా అవార్డుల్లో పుష్ప మూవీ దుమ్ము రేపింది. అనేక కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సాహిత్య రచయిత…
Meruga Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని.. ఆయనకు జబ్బుతో పాటు వయసు కూడా సహకరించడం లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ తమపై అసభ్యపదజాలంతో దూషించడాన్ని ఖండిస్తున్నామన్నారు. లోకేష్‌కు 40 ఏళ్లు కూడా ఉండవని.. ఆయనకు తాము కొడుకులం ఎలా అవుతామని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. లోకేష్ ఒక లుచ్చా అని.. ఆవు చేలో మేస్తే.. దూడ కూడా చేలోనే మేస్తుందని.. చంద్రబాబు గడ్డి తింటున్నారు కాబట్టి…
CM Jagan: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో గెలవాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 22న కుప్పంలో పర్యటించి రూ.66 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ…
Lakshmi Parvathi: చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ నేత లక్ష్మీపార్వతికి ఎదురుదెబ్బ తగిలింది. ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరు అంటూ సుప్రీంకోర్టు ఆమెను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై తెలుగు అకాడమీ ఛైర్పర్సన్, వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందించారు. తన కేసులో ఒకరి ఆస్తుల గురించి ప్రశ్నించడానికి తానెవరు అని అత్యున్నత నాయస్థానం ప్రశ్నించిందని.. అయితే జగన్ ఆస్తుల కేసులో శంకర్రావు ఎవరు అని…
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు పచ్చజెండా ఊపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య బదిలీల కోసం పలువురు ఉద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు అంతరాష్ట్ర బదిలీల కోసం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకు 1338 మంది ఉద్యోగులు, ఏపీ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. జీఏడీ రాష్ట్ర పునర్విభజన…