Somu Veerraju: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ది చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ సర్పంచులకు నిధులు పెంచారన్నారు. అయితే కేంద్రం ఇచ్చిన నిధులు సర్పంచులకు ఇవ్వకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సోము వీర్రాజు ఆరోపించారు. అక్టోబర్ 2 నుంచి సర్పంచులకు ఇవ్వాల్సిన నిధుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నామని తెలిపారు. మోదీ ఇచ్చిన నిధులతో రోడ్లు వేస్తున్నారని..…
Kanna Lakshmi Narayana: బీజేపీ సీనియర్ నేత, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మైనింగ్, లిక్కర్, ఎర్రచందనం స్మగ్లింగ్, భూ కుంభకోణాలతో జగన్ దోపిడీ వ్యవస్థను నడుపుతున్నారని తిరుపతిలో నిర్వహించిన ‘బీజేపీ ప్రజాపోరు వీధి సభ’లో కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. ఆయన అస్తవ్యస్త పాలనతో జనం విసిగిపోయారని ఆరోపించారు. వైసీపీ అసమర్థపరులపై తాము పోరాటం…
MLC Venkateswara Rao: శాసన మండలిలో చర్చ కంటే రచ్చ ఎక్కువగా నడిచిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ నేతలు ఎవరి గొప్పలు వారు చెప్పుకున్నారని.. పోలవరంపై వాస్తవాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని పీడీఎఫ్ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అసలు పోలవరం ప్రాజెక్టు వ్యయం ఎంత.. నిర్వాసితులకు ఇచ్చే పరిహారం ఎంతో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. 75శాతం ప్రాజెక్టు పూర్తి చేశామని కేంద్ర ప్రభుత్వం…
Minister Roja: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం వచ్చిందంటే చాలు పవన్ కళ్యాణ్ వచ్చి అజ్ఞానంగా మాట్లాడిపోతాడని.. నిన్న దొంగ సర్వేల గురించి చెప్పాడని ఆరోపించారు. ఇలాంటి సర్వేల వల్లే గతంలో బొక్కబోర్లా పడ్డాడని.. తమకు 45 సీట్లు వస్తాయంటే.. ఆయనకు 130 వస్తాయా అని రోజా ప్రశ్నించారు. పవన్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని.. 2019లో ఆయన మాటే శాసనం అన్నాడని.. అసెంబ్లీపై జనసేన జెండా ఎగరేస్తానని చెప్పాడని..…
Vidadala Rajini: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి విడదల రజినీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి మూడు రాజధానుల అవసరాన్ని సీఎం జగన్ ఇప్పటికే చెప్పారని.. అయినా చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని విడదల రజినీ వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగం, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని.. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు త్వరలో మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తే చంద్రబాబే…
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఆరోపించారు. చిరంజీవి దయతో ఈ స్థాయికి వచ్చిన పవన్ ఆయన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని.. తాను చాలా పునీతుడినని అన్నట్లు పవన్ మాటలు ఉన్నాయని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2009లో ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపించలేదని.. ఆనాడు…
Minister PeddiReddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎం జగన్ అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించారని.. ఆ వివరాలు వెబ్సైట్లో ఉన్నాయన్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఆ వివరాలు చూసుకుని ఏవైనా తప్పులుంటే టీడీపీ నేతలే చెప్పాలని హితవు పలికారు. కొన్ని…
KRJ Bharath: ఏపీలో కుప్పం రాజకీయాలు కాక రేపుతున్నాయి. వైసీపీ నేత, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చంద్రమౌళి కుమారుడు కేఆర్జే భరత్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా కుప్పం నియోజకవర్గ ఇంఛార్జిగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా మండలి ఛైర్మన్ అవతారం ఎత్తారు. మొన్నటికి మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ ఎన్నికై.. దేశంలోనే అతి చిన్న వయసులో స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నేతగా గుర్తింపు సాధించారు. తాజాగా ఏపీ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్న…