రాజధాని అనేది సైలెంట్ ఫ్యూచర్.. మూడు రాజధానులు అంటే బే పార్క్, వాల్తేర్ క్లబ్ కాదంటూ వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆదివారం ఏపీ బీజేపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. భూములు ఇచ్చిన రైతులను రోడ్డెక్కిస్తారా….? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీలు సైక్లాజికల్ గేమ్ నడుస్తోందని, మేం సర్జికల్ సైక్లాజికల్ గేమ్ స్టార్ట్ చేస్తామన్నారు. 7వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని ఏమైందని రెండు పార్టీలను ప్రశ్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో దిశ, దశ లేని రాజకీయాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో రూలింగ్ కంటే ట్రేడింగ్ జరుగుతోందని విమర్శించారు.
వైసీపీ, టీడీపీలు బీజేపీతో దోబూచులాడుతున్నాయని, త్వరలో ఈ రెండు పార్టీలు కనుమరుగు అవ్వడం ఖాయం… ఆ పని బీజేపీ చేస్తుందన్నారు. 2024లో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్న సోము వీర్రాజు.. విశాఖ నుంచే పోరుయాత్ర ప్రారంభమవుతుందని, రాష్ట్రంలో ఐదు వేల సభలు పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో 2కోట్ల 75లక్షల మంది వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా బీజేపీకి పొత్తు ఉందని, ఈ సామర్థ్యం లేనందునే రాజకీయ పార్టీలు మాతో పొత్తులు కోరుకుంటున్నామని, వైసీపీ,టీడీపీలు డ్రామా పార్టీలు ఆడుతున్నాయని ఆయన మండిపడ్డారు. 8ఏళ్ళు అధికారం ఇస్తే ఆంధకారం చేశారంటూ ఆయన ధ్వజమెత్తారు.