ఏపీ సీఎం జగన్ నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఇతర కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికారులు ఇప్పటికే పర్యవేక్షించారు. అయితే.. సీఎం వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా.. ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు.
Also Read : Sai Pallavi : ‘ఆకాశం’ సినిమా నుంచి ‘ఊపిరే హాయిగా’ సాంగ్ రిలీజ్ చేసిన సాయిపల్లవి
10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు సీఎం జగన్ చేరుకోనున్నారు. 11.10 – మధ్యాహ్నం 1.10 గంటల వరకు నేలటూరులో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్.