ఏపీలో వైసీPM Narendra Modi: మోడీ తెలంగాణ పర్యటన.. మూడంచెల భద్రత ఏర్పాటుపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా జగన్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ళ పథకంపై ఫోకస్ పెట్టింది జనసేన. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు జగనన్న ఇళ్ల పథకం సోషల్ ఆడిట్ నిర్వహించనుంది జనసేన. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఇళ్ల కాలనీలు.. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించనున్నారు జనసేన నేతలు. రేపు విజయనగరం జిల్లా గుంకలాంలో అతి పెద్ద జగనన్న కాలనీ వెంచరులో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు పేరుతో జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
Read Also: Himachal Assembly Poll Live Updates: నేడే హిమాచల్ పోలింగ్.. బరిలో 412 మంది అభ్యర్థులు
విజయనగరంతో పాటు రాజమండ్రి, గుంటూరు జిల్లాల్లో జరిగే సోషల్ ఆడిట్ కార్యక్రమంలో పవన్ పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు..ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో జనం వద్దకు వెళ్తున్న జనసేన పార్టీ.. జనవాణి కార్యక్రమం నిర్వహిస్తోంది.. కౌలు రైతుల కుటుంబాల పరామర్శలు జరుగుతున్నాయి. బాధిత రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ నేనున్నాను అనే భరోసా కల్పిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా జనసేన సోషల్ ఆడిట్ అంటూ మరో పోరాట పంథాను ఎంచుకోవడంతో జనసేన ప్రజల్లోకి వెళ్ళేందుకు, పార్టీని సోషల్ మీడియాలో యాక్టివ్ చేసేందుకు అవకాశం కుదిరిందని అంటున్నారు.
ప్రభుత్వ పథకాలు క్షేత్ర స్థాయిలో సరిగా అమలవుతున్నాయా లేదా? వాటి లోటుపాట్లేంటి..? ప్రజల ఇబ్బందులేంటి…? అనే వాటిపై ప్రజల నుంచే సమాచారాన్ని సేకరించడం కోసం ఈ సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామంటున్నారు జనసేన నేతలు. ఈ సందర్భంగా సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటిలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ.. సర్కార్‌ను నిలదీయడం.. పథకాల్లోని లొసుగులను చూపిస్తూ.. సక్రమంగా అమలు చేసేలా చూస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. అయితే జనసేన తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటీవల ఇప్పటంలో లేనిపోని హడావిడి చేశారని, తమకు సానుభూతి వద్దని, తాము ఇబ్బందులలలో లేవని ఫ్లెక్సీలు వెలిశాయి.
వైసీపీ నేతలు మంత్రులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రోడ్ల దుస్థితిపై జనసేన సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించింది. జనం ఫోటోలతో తమ ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ప్రచారం ట్రెండ్ అవుతోంది. మరి జగనన్న ఇళ్ళ పథకంపై జనసేన సోషల్ ఆడిట్ ఎలాంటి స్పందన తెస్తుందో చూడాలి మరి.
Read Also: