Gudivada Amarnath: ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహారం.. పెట్టుబడులపై తప్పుడు ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడులు.. ప్రగతి గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసేలా టీడీపీ.. చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. తన హయాంలో రూ. 5 లక్షల కోట్లు పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు తెచ్చామని చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారు.. గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూల్లో కేవలం రూ. 34 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి.. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంటే కేవలం 2 శాతం మాత్రమే గ్రౌండ్ అయ్యాయని వెల్లడించారు.
Read Also: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పెన్షన్ల పెంపు ఒక్కటే కాదు..
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ఇక, జిందాల్ స్టీల్ సంస్థ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుందని వెల్లడించారు మంత్రి అమర్నాథ్.. మొదటి విడతకు త్వరలోనే భూమి పూజ చేపట్టనున్నాం.. కడప ప్రజల చిరకాల వాంఛను తీర్చనున్నాం అన్నారు. గతంలో వైఎస్ హయాంలో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకుంటే నాటి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ఆరోపించిన ఆయన.. ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రయత్నాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు.. ఏపీలోని పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు విషయంలో దేశానికి దిక్సూచిగా ఉంది. ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టే అవకాశం ఉందో పబ్లిక్ డొమైనులోనే ఉందని.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పీఎస్పీల ద్వారా ఆదాయం వస్తోందన్నారు. 13500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రస్తుతం ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిందన్న ఆయన.. ఇంకా 20 వేల మెగా వాట్లను పీఎస్పీల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు.. మరిన్ని ప్రాజెక్టులు పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తే మేం ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు.. అమర్ రాజా వెళ్లిపోయిందన్నారు.. ఇప్పుడు అదే అమర్ రాజా రూ. 250 కోట్లు పెట్టుబడులు పెడుతోందని తెలిపారు మంత్రి అమర్నాథ్.. అనకాపల్లి నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో హెరిటేజ్ కంపెనీ పన్నులు కట్టలేదు.. మేమన్నా ఇబ్బంది పెట్టామా..? అని ప్రశ్నించిన ఆయన.. ప్రాసెస్ ప్రకారం నోటీసులిచ్చారు.. రూ. 60 లక్షలు కట్టారని వెల్లడించారు.. అయితే, పరిశ్రమల వల్ల ఒక్క ప్రాణం పోయినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అని స్పష్టం చేశారు. టీడీపీ తరహాలో అబద్దాలు చెప్పం.. చెప్పలేమన్న ఆయన.. తమను 23 స్థానాలకే పరిమితం చేశారని ప్రజలపై.. రాష్ట్రంపై చంద్రబాబుకు కోపం ఉంటే ఎలా..? అని నరిలదీశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు