Pawan Kalyan Comments on YSRCP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. బాలయోగి తర్వాత కోనసీమ అభివృద్దిని పట్టించుకున్న నాయకుడు లేడని పేర్కొన్న ఆయన కోనసీమకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లేదు, ఏదైనా ప్రమాదం జరిగితే కాకినాడకు వెళ్లాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. 14 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డాను అంటే అది మీ బలం అని, కోనసీమ ప్రజలకు…
ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలకు సీఎం వైఎస్ జగన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.. అక్టోబర్ నెల డెడ్ లైన్‌గా పెట్టారు.. అక్టోబరులోగా పని తీరు మెరుగు పర్చుకోకుంటే నో టికెట్స్ అంటూ తేల్చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్.. అక్టోబర్ నాటికి పని తీరు మెరుగుపరుచుకోవాలని సూచించిన ఆయన.. 18 మంది పేర్లు చెప్పడం సరికాదన్నారు.
సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.. 'జగనన్న సురక్ష' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తారు..
హరి రామ జోగయ్య లేఖ ద్వారా ముద్రగడకు కౌంట్ ఇచ్చారు.. వారాహి యాత్ర ద్వారా దూసుకుపోతున్న పవన్ కల్యాణ్‌ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన ఆశిస్తుందన్న ఆయన.. చిన్న మంత్రి పదవులు ఆశించి.. రెడ్డి కులాధిపతికి కాపులను తాకట్టు పెట్టాలని చూస్తున్న నాయకులను చూసి మోసపోకండి అని పిలుపునిచ్చారు.
ముద్రగడ లేఖను పవన్ కల్యాణ్ చదివితే వెంటనే ఏపీ నుంచి పారిపోతారని పేర్కొన్నారు మంత్రి జోగి రమేష్.. ముద్రగడ విలువలు ఉన్న వారు గనుక విలువల గల లేఖ రాశారని చెప్పుకొచ్చారు.. పవన్ కల్యాణ్‌కి సినిమాలు, కాల్ షీట్లు లేవు.. అందుకే ఇక్కడ చంద్రబాబు డైరెక్షన్లో యాక్షన్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.. దీనికి కో డైరెక్టర్ నాదెండ్ల మనోహర్ అని సెటైర్లు వేశారు.
సినిమాటిక్ యాత్ర లా పవన్ హావ భావాలు ఉన్నాయన్నారు.. అభిమానులను అలరించడానికి ఈ యాత్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు