పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు సజ్జల.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు.
డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఆర్కే రోజా.. ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ పవన్ పై సెటైర్లు వేశారు.