Moinabad Farmhouse Drugs Case: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు బెయిల్..
- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఎంపీకి బెయిల్
- డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ అయినా ఊరట
- పార్లమెంట్ సమావేశాల కారణంగా కోర్టు నిర్ణయం
- రాజీనామా చేయాలంటూ రాజకీయ దుమారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన టీడీపి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌తో పాటు ప్రియాంక రెడ్డి అనే మహిళకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్‌కు పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు సమాచారం. అయితే, మార్చి 16 (సోమవారం) నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రజాప్రతినిధిగా ఆయన సభకు హాజరుకావాల్సి ఉన్నందున, ఆ కారణాన్ని పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. పుట్టా మహేష్‌తో పాటు అదే పార్టీలో పాల్గొన్న ప్రియాంక రెడ్డికి కూడా ఊరట లభించింది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
Vizag: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం..
ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి డ్రగ్స్ తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎంపీ స్థానంలో ఉండి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని, పుట్టా మహేష్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కొద్దిరోజుల క్రితం మొయినాబాద్‌లోని ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈగల్ టీమ్ , ఎస్వోటీ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో ఎంపీతో పాటు మొత్తం ఎనిమిది మంది పట్టుబడ్డారు. అక్కడ భారీగా కొకైన్ , ఒక రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!