నెల్లూరు సిటీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సీనియర్ వైసీపీ నేత రూప్ కుమార్ యాదవ్ మధ్య గత కొంతకాలంగా విభేదాల నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (సోమవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ భేటీ సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు అనిల్ కుమార్ తో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుకున్నారు. నెల్లూరు జిల్లాలో, నెల్లూరు సిటీలో పార్టీ పరిస్థితులపై జగన్ చర్చించారు.
నెల్లూరు సిటీ పార్టీలో విభేధాలు, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనిల్ కుమార్ యాదవ్ వివరించారు. నెల్లూరు జిల్లా, సిటీల్లో పార్టీ పటిష్టంగా ఉందని సీఎంకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. మరోసారి నెల్లూరు సిటీలో విజయబావుటా ఎగురవేస్తామని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ నేతలంతా కలసికట్టుగా నడిచి పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని నేతలకు ఆయన సూచించారు.
Read Also: Smart Watch : స్మార్ట్ వాచ్ ను వాడితే బరువు తగ్గుతారా?
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోరారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. పెండింగ్ పనులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే సత్వరమే పనులు పూర్తి చేయాలని దానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. నెల్లూరులో విభేదాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ యాదవ్ కు సీఎం జగన్ సూచించారు.