పొలిటికల్ కరప్షన్ లేని జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని 2024లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో వచ్చేది జనసేన- టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కనుక మేం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ సభలో ఈ సమస్యపై మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.
ఏపీ లోక్సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈ సారి 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో గెలిచి క్లీన్స్వీప్ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైస్సార్సీపీ విజయం తథ్యమని వెల్లడించింది.
సన్నాసి అంటే తిట్టు కాదు.. ఏమి లేనివాడు అని అర్థమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీవాళ్లు ఆ మాటకు బాధపడితే భవిష్యత్లో ఆ మాట మాట్లాడను.. అది కూడా వారి ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు.
కులాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధించలేమని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
రాష్ట్రం కోసం చావడానికైనా సిద్ధం కానీ ఈ ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మా కుటుంబాల మీద రోజా చేసిన వ్యాఖ్యలు ఆధారాలతో సహా ఇస్తాం మంత్రి మీద కేసు పెట్టే దమ్ము పోలీసులకు ఉందా అంటూ అయ్యన్న సవాల్ విసిరారు.