ఇన్నేళ్లకు భువనేశ్వరికి తండ్రి గుర్తుకు రావడం ఆశ్చర్య మేస్తోందని తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటే నీ భర్త చేసిన లక్షల కోట్ల అవినీతి బయట పెట్టాలని ఆమె అన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో రాయలసీమ ప్రాంతంలో కక్ష సాధింపు, ఫ్యాక్షనిజం, అక్రమ కేసులు పెట్టడం లాంటి రాజకీయాలను చూశామని, నెల్లూరు ప్రశాంతతకు మారుపేరు అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మంత్రి మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మహాత్ముడి జయంతిన దీక్ష చేస్తాడట.. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర ఉద్యమం మీద అవగాహన ఉంటే ఇలాంటి పనులు చేయడంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
2024లో వచ్చేది జనసేన - టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి ఉన్న నేతను ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసన్నారు. తమకు నైతికంగా బలం ఉంది కాబట్టే.. నేనింత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే వాడిని అయ్యామన్నారు. తాను ప్యాకేజ్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని.. తనకు డబ్బంటే ప్రేమ లేదని వాళ్లకెలా చెప్పనంటూ పేర్కొన్నారు.
ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
టీడీపీ పార్టీ మోతలు ఎందుకు.. లంచాలు తీసుకొని కంచాలు కొట్టడం ఎందుకు.. అన్ని కోర్టులు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఖైదీగా ఉన్నాడు.. ఎవరి కోసం హారన్లు.. ఎవరి కోసం విజిల్స్? అంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.