AP Fibernet Scam: ఫైబర్ నెట్ స్కాంలో పెద్ద తలకాయల పాత్ర ఉందని గతంలోనే చెప్పాను.. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు ఇందులో ఉన్నారని చెప్పాను అని గుర్తుచేసుకున్నారు APSFL చైర్మన్ గౌతం రెడ్డి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే ఫైబర్ నెట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్నారు.. ఫైబర్ నెట్ స్కాంలో టేరా సాఫ్ట్ సంస్థదే కీలక పాత్ర అన్నారు.. స్కాంలో టెరా కంపెనీ లేకపోతే అసలు స్కామే లేదన్న ఆయన.. ఈ సంస్థకు ఒక్క రోజులో టెండర్ ను ఇచ్చేశారు.. సంస్థ నుంచి రాజీనామా చేసిన వారికి APSFLలో డైరెక్టర్ చేసేశారన్నారు. అయితే, స్కాంలో నారా లోకేష్ పాత్ర ఉందా? లేదా? అనేది సీఐడీ డిసైడ్ చేస్తుందన్నారు. గతంలో చంద్రబాబు అనేక అక్రమ అరెస్టులు చేయించారని మండిపడ్డారు. చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికి జైలుకి వెళ్లారని తెలిపారు గౌతంరెడ్డి.
Read Also: Animal : రశ్మికతో రణబీర్.. మోస్ట్ వయిలెంట్ ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారట!
ఇక, జనరల్ బాడీ మీటింగులో కీలక నిర్ణయాలు తీసుకున్నాం అని తెలిపారు గౌతంరెడ్డి.. 150 కోట్లు హడ్కో నుంచి రుణం తీసుకుంటున్నాం.. 325 కోట్ల రూపాయల రుణాల కోసం రేస్కోకి ప్రతిపాదనలు పంపాం అన్నారు.. గతంలో జరిగిన పనులపై ఆడిట్ చేయాలని, కాగ్ కి పంపాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సంస్థ ఆపరేషన్ నిర్వహణ గతంలో టెరా సాఫ్టు కంపెనీ నిర్వహించేది.. ఆ సంస్థ సేవలు నిలిపి వేశాం కాబట్టి మేమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. ఇలా చేయటం వల్ల ప్రతి ఏడాది 32 కోట్ల రూపాయలు ఆదా అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా టెలీకం వర్కులు చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. సంస్థ రూ. 2 వేల కోట్ల వరకు రుణాలు తీసుకోవటానికి నిర్ణయించినట్టు పేర్కొన్నారు APSFL చైర్మన్ గౌతం రెడ్డి.