YS Jagan: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.. అదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి.. అయితే, ఈ సారి రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకుంది ఆ పార్టీ.. వై నాట్ 175.. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల నినాదం ఇదే.. ఎవరెవరు కలిసినా.. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పోటీ చేసినా.. తనదే గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో.. ప్రజాప్రతినిధులను, నేతలను, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు.. అందులో భాగంగా.. ఈ నెల 9న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభ ఏర్పాటు చేశారు.. సుమారు 8 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు..
Read Also: Flipkart : ఫ్లిప్ కార్ట్ వ్యాన్ నుంచి గాల్లోకి రూ.2వేల నోట్లు.. ఎక్కడంటే?
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రతినిధుల సభకు వేదిక కాబోతోంది.. ఈ సభలోనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జులు, రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు.. ఎంపీపీలు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ జిల్లా, మండల స్థాయి నేతలు, అనుబంధ విభాగాల నేతలు కూడా ఈ ప్రతినిధుల సభకు హాజరుకాబోతున్నారు.. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా కసరత్తు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనేది పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపైన్ ను క్షేత్ర స్థాయిలో తీసుకుని వెళ్లే విధంగా శ్రేణులను సమాయత్తం చేయటమే సమావేశ ఎజెండా ఉందంటున్నారు..