Jagananna Arogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్ష.. ఊరూ వాడా అపూర్వ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagananna Arogya Suraksha: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది.. జగనన్న ఆరోగ్య సురక్ష ఈ నెల 5వ తేదీ (శుక్రవారం) వరకు సాగిన కార్యక్రమ వివరాలను పరిశీలిస్తే అపూర్వంగా సాగుతోంది.. అక్టోబర్ 5వ తేదీ నాటికి నిర్వహించిన మొత్తం శిబిరాలు 2,429గా పేర్కొంది ప్రభుత్వం.. ఇక, శిబిరాలకు హాజరైన మొత్తం ప్రజల సంఖ్య 10 లక్షలకు పైగానే ఉంది.. ఉచితంగా వైద్యులను సంప్రదించగలిగే పౌరులు లక్ష 9.9 లక్షలకు పైగా ఉందని సర్కార్ తెలిపింది.. మరోవైపు.. ఇంటి వద్దేకే వెళ్లి 3.82 కోట్లకు పైగా రాపిడ్ పరీక్షలు నిర్వహించారు.. ఇప్పటి వరకు ఆరోగ్య పరీక్షలు పూర్తయిన పౌరుల సంఖ్య 2.33 కోట్లకు పైగా ఉంది.. మొత్తంగా డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య శాఖ షెడ్యూల్ ప్రకారం వైద్య శిబిరాలను జోరుగా నిర్వహిస్తోంది. శిబిరాల్లో ప్రజలు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యుల సేవలను పొందుతున్నారు. డాక్టర్లు సూచించిన మందులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ జరుగుతోంది.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభించిన విషయం విదితమే.
Read Also: China: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చైనా మధ్యవర్తిత్వం.. టిబెట్‌లో సమావేశాలు..
Also Read
ఇక, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలు సందర్శించి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. ఆరోగ్య సమస్యలున్న వారిని గుర్తించి వైద్య శిబిరాలకు హాజరు కావాలని కోరుతూ టోకెన్లు జారీ చేస్తుండగా.. కొన్ని సందర్భార్లో టోకెన్లు లేకున్నా కూడా ఆయా ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న వైద్య శిబిరానికి రావొచ్చు.. వైద్య సేవలు పొందవచ్చు అని అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు కూడా కొన్ని ప్రాంతాల్లో రద్దీని బట్టి ఏర్పాటు చేస్తున్నారు.. ఆరోగ్య సురక్ష శిబిరంలో వైద్య సేవలు పొందాం.. బయట చూయించుకుంటే బోలెడంత ఖర్చు అయ్యేది.. ఇక్కడే మందులతో సహా ఇస్తున్నారంటూ శిబిరాలను సందర్శించిన ప్రజలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!