ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన వైనాన్ని, వారికి చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర మంగళవారం విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో జరిగింది. నెల్లిమర్లలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరగింది. మంత్రులు సీదిరి అప్పలరాజు, రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు హాజరయ్యారు.
రాజోలు నియోజకవర్గంలో రాజకీయం రాజుకుంటుంది.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాటిపాక బహిరంగ సభలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. లోకేష్ ఆలోచించకుండా, తెలియకుండా మాట్లాడటం సరికాదని హితవుపలికారు.
ఎచ్చెర్లను ప్రజల కోరిక మేరకే శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గం కొనసాగించామని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా చిలకలపాలెంలో సామాజిక సాధికార యాత్రలో మంత్రి ప్రసంగించారు. మత్స్యకారుడైన అప్పలరాజును మంత్రిని చేయడంతో బుడగట్లపాలెం, మంచినీళ్లపేటలో ఫిషింగ్ హార్బర్లు వచ్చాయన్నారు.
టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా, చంద్రబాబును అడుగుతున్నానని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పూర్తి చేసిన అంశాలు, అమలైన పథకాలు వదిలేసి, ఏవేవో మాట్లాడతారని ఆయన వ్యాఖ్యానించారు.
పల్నాడు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న కొమ్మారెడ్డి చలమారెడ్డి వైసీపీలో చేరనున్నారు.. మాచర్ల నియోజక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి.. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్నారు.. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
పవన్ కళ్యాణ్ విశాఖలో 50వేల చెక్కు ఇచ్చి జగన్ను దూషించడం మొదలుపెట్టారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గడ్డం పెరిగినా, ఫ్లైట్ లేట్ అయినా సీఎం జగన్ కారణం అంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీకి... ఏంటయ్యా... మీ నీచ రాజకీయాలు అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టు పేర్ని నాని తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లపై హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఆ పిల్ ప్రకారం ఆర్డీఓ, డీటీకి షోకాజ్ నోటీసులు ఇస్తే కాళ్లు పట్టుకుని అపుకున్నాడని ఆయన విమర్శించారు.