ఏపీలో జనసేన పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఇంఛార్జి సందీప్ రాయల్‌తో పాటు రాయలసీమ రీజియన్ ఇంఛార్జి పద్మావతి పసుపులేటిలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో అన్నీ రంగాల్లో సాధికారత సాధించామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాజకీయంగా అన్నీ వర్గాలను చెయ్యి పట్టుకుని నడిపించామని ఆయన వెల్లడించారు. గతంలో టీడీపీ హయాంలో ఎన్నికల సమయంలో మాత్రమే అణగారిన వర్గాలు గుర్తుకు వచ్చేవని మంత్రి పేర్కొన్నారు.
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూర్ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణల నేపథ్యంలో.. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ ను టీడీపీ బృందం కలిసింది.
గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాలనుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు.. సీఎంలుగా వైఎస్ఆర్, వైఎస్ జగన్.. గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారు. గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు... 14ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశాడు..? అని నిలదీశారు.