Markapuram MLA brother KP Krishnamohan Reddy Slams TDP Leaders: మార్కాపురం టీడీపీ నేతల భూదందాలు బయటపెట్టడంతో పాటు వారి ఆదాయానికి గండి కొట్టాననే ఉద్దేశంతో తమపై, వైసీపీ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. తమపై తప్పుడు ఆరోపణలు చేయిస్తూ.. రాజకీయ లబ్ది పొందేందుకు కుట్రలు చేస్తున్నారని కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. గత రెండు రోజులుగా టీడీపీ…
కృష్ణాజిల్లా గుడివాడలోని 15వ వార్డులో రూ. 3కోట్ల 28లక్షల నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్యే కొడాలి నాని, కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారికతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రారంభించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వావి వరసలు లేని రాజకీయాలు చేస్తున్నారని.. పవన్ కళ్యాణ్ పీల్చే ప్రతీ శ్వాస చంద్రబాబుకి అధికారం కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో విశాఖ జిల్లా టీడీపీ ముఖ్య నాయకత్వం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. అరగంటకు పైగా సమావేశం జరిగింది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ.. ఇన్నాళ్ల ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా సమాధానం ఇచ్చేసింది. మూడు రాజధానుల ఏర్పాటుపై వడివడిగా అడుగులేస్తున్న జగన్ సర్కార్.. విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసింది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లూ జాప్యం జరిగినా.. డిసెంబర్ 8వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి
కుల గణన ప్రక్రియ వాయిదా పడిందని.. ఈ నెల 27కు బదులు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వెల్లడించారు. పేదల జీవన స్థితిగతులను మెరుగు పరిచేందుకే కులగణన అంటూ ఆయన పేర్కొన్నారు.