Nandigam Suresh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగింది జనసేన పార్టీ.. అయితే, ఒక్కచోట కూడా విజయం సాధించకపోగా.. డిపాజిట్లు కూడా రాకపోవడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.. తాజాగా, అనంతపురంలో ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు.. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు చేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని.. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Telangana CM: కాంగ్రెస్ పార్టీలో కొలిక్కిరాని సీఎం ఎంపిక
ఇక, ఇచ్చిన హామీలను ఏనాడూ చంద్రబాబు అమలు చేయలేదన్నారు నందిగాం సురేష్.. వైఎస్ జగన్ పాలనలో 99 శాతం హామీలు నెరవేరాయి.. పేదల సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేనన్న ఆయన.. టీడీపీ పాలనలో రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం ఉండేది.. వైఎస్సార్ సీపీ పాలనలో ముఠా కక్షలు అంతమయ్యాయి… జగన్ ను భయపెట్టే మగ్గాడు ఇంత వరకు పుట్టలేదని వ్యాఖ్యానించారు ఎంపీ నందిగాం సురేష్. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది.. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి పవన్ కల్యాణ్ కూడా వెళ్లారు.. కానీ, పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.. మొత్తం 8 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది. కూకట్‌పల్లిలో మాత్రమే ప్రస్తావించదగిన స్థానంలో ఉన్నారు. కానీ, చివరికి ఇక్కడ కూడా ఓడిపోయారు.