తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో చూశామన్న ఆయన.. ఏపీలో టీడీపీ, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారం కోసం కాదు ప్రతిపక్షం కోసం చంద్రబాబు జనసేనను కలుపు కున్నాడని.. ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నాడు.. ఎమ్మెల్యే కోసం పవన్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు…
ఈ నెల 9న జరగాల్సిన సమగ్ర కుల గణన మిచౌంగ్ తుఫాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ..
ప్రభుత్వానికి, పార్టీకి మధ్య తేడా ఉంది.. నన్ను ఓ పార్టీ ఏజెంట్ అనడం తప్పు అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మాజీ ఎన్నికల కమిషనర్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్..
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు.. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు చేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని.. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. లేనిపోని ఆరోపణలు చేస్తే లోకేష్ నాలుక కట్ చేస్తాను అంటూ హెచ్చరించారు.
దమ్ముంటే రాజకీయాల్లోకి వచ్చాక నేను ఎక్కడైనా ఒక్క రూపాయి తిన్నానని రామ్మోహన్ నాయుడు నిరూపించినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు.
రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించి, రాజకీయాలను భ్రష్టు పట్టించే ప్రయత్నం లోకేష్ బాబు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎవరు నిలబడరు అని ఆయన అన్నారు. తనకు బ్యానర్లు కట్టడానికి వచ్చిన వాళ్లను కూడా చంద్రబాబుకు బ్యానర్లు కట్టమని పంపిస్తున్నాడని పేర్కొన్నారు.