Posani Krishnamurali: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కలలు కంటోందని.. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ జగన్ గెలుస్తాడు అని చెప్పరు ఓడితే మాత్రం అది జరుగుతుంది అంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని పోసాని ప్రశ్నించారు. రెండు వేర్వేరు రాష్ట్రాలు అని టీడీపీ తెలుసుకోవాలన్నారు. టీడీపీకి సామర్థ్యం ఉంటే తెలంగాణలో పోటీ చేయాలి కదా.. తెలంగాణలో జనసేనకు టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదో చెప్పాలన్నారు. తప్పు చేసి చంద్రబాబు జైల్లో ఉంటే పవన్ తన ప్రాధాన్యత పక్కన పెట్టి పవన్ సపోర్ట్ చేశాడని .. ఏపీలో పవన్ సపోర్ట్ చేస్తునపుడు తెలంగాణలో టీడీపీ సపోర్ట్ చేయాలి కదా ? ఎందుకు చేయరని ఆయన ప్రశ్నలు గుప్పించారు.
Read Also: Tammineni Sitaram: ఆర్కే ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు..
చంద్రబాబు లాంటి పొలిటీషియన్ ఎక్కడైనా ఉంటారా.. కాంగ్రెస్‌కు చేసినది జనసేనకు చేయచ్చు కదా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో పవన్‌ను సపోర్ట్ చేయకుండా వాడుకుంటున్న టీడీపీ ఏపీలో ఆయన్ని వదిలేయాలన్నారు. కాపు సోదరులకు ముందు నుంచే చంద్రబాబు ముంచేస్తాడు అని చెబుతూనే ఉన్నామన్నారు. గెలిచినా ఓడినా పొత్తులో ఉన్న పార్టీకి ఓట్లు వేయించాలి కదా అంటూ పోసాని పేర్కొన్నారు.
పవన్ తన ఓట్లు అన్నీ చంద్రబాబుకి వేయాలని చెబుతుంటే పవన్ అభ్యర్దులు మాత్రమే, కాపుల ఓట్లు చంద్రబాబుకి కావాలి, కానీ కాపులు గెలవకూడదా అంటూ ప్రశ్నించారు. గెలిస్తే సీట్లో ఎక్కుతాడు అని భయమా అంటూ విమర్శించారు. పవన్ అమాయకుడు చంద్రబాబును గుడ్డిగా నమ్మేశాడని.. కాపులు టీడీపీకి ఓట్లు వేయాలి కమ్మ వారి ఓట్లు మాత్రం జనసేనకు వేయించవా అంటూ ప్రశ్నలు గుప్పించారు. తెలంగాణలో జనసేన గెలిస్తే ఏపీలో ఎక్కువ సీట్లు పవన్ అడుగుతాడు అని చంద్రబాబుకి భయమా అంటూ పోసాని కృష్ణమురళి అన్నారు.