పెళ్లి ఊరేగింపుపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి! 11 మందికి గాయాలు మధ్యప్రదేశ్లోని రాయిసేన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి సుల్తాన్పూర్ ప్రాంతంలో పెళ్లి ఊరేగింపు జరుగుతున్న సమయంలో ఓ ట్రక్కు అదుపు తప్పి.. జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 11 మందికి పైగా గాయపడగా.. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి బృందం హోసంగాబాద్ నుంచి పిపరియా గ్రామానికి జాతీయ రహదారిపై…
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కును ఆయన ప్రారంభించనున్నారు.
అధికారం కాదు.. విలువలు ముఖ్యం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పందించిన ఆయన.. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం అని హితవు పలికారు.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పొత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారని మండిపడ్డారు.