ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కాడని.. 2024లో మీరు తమ కోసం రెండు బటన్లు నొక్కాలన్నారు. తొలి బటన్ ఎమ్మెల్యేకు, రెండవది ఎంపీ నొక్కి వైసీపీకి అండగా నిలవాలని మంత్రి రోజా కోరింది.
నాకు ఇవే చివరి ఎన్నికలు అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. నా కూతుళ్ళకు రాజకీయాలలో ఆసక్తి లేదు.. రాజకీయాలలో ఆసక్తి ఉంటే నా తమ్ముడి కొడుకు వస్తాడేమో అని తెలిపారు.
అభివృద్ధి లేకుంటే తలసరి ఆదాయం పెరగదు అని ఎంపీ విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) అన్నారు. తలసరి ఆదాయం, రాష్ట్ర స్తూల ఉత్పత్తి లో ఏపీ ముందుంది.. రామాయపట్నం పోర్టును సీఎం జగన్ ( cm jagan ) చేతుల మీదుగా శంఖుస్థాపన చేసి ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు.
నెల్లూరు ( Nellore ) జిల్లాలోని కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ( Vijaysai Reddy) పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఎన్నికలు రాష్ర్ట భవిష్యత్ కు కీలకమైనవి అని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవ్వడం చారిత్రక అవసరం ఉందని పేర్కొన్నారు.