Ashok Gajapathi Raju: పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా.. అంతా కలిసి టీడీపీకి కోసం పనిచేస్తాం.. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు అని జోస్యం చెప్పారు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ ఇస్తూ.. పలువురు నేతలు టీడీపీకి గూటికి చేరారు.. గంట్యాడ మండల వైసీపీ అధ్యక్షుడుతో సహా నలుగురు మాజీ సర్పంచులు, నలుగురు మాజీ ఎంపీటీసీలు, 16 మంది వార్డు మెంబర్లు, 50 వైసీపీ కుటుంబాలు వైసీపీకి బైబై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న 100 మందికి పైగా వైసీపీ శ్రేణులు.. ఈ సందర్బంగా అశోక్ గజపతి మాట్లాడుతూ.. టీడీపీలో అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా అభ్యర్థితో కలిసి పని చేయాలని సూచించారు.
Read Also: Babu Mohan: నేను పోటీచేయడంలేదు.. కేఏ పాల్ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మేలు..!
ఇక, ఈ ఎన్నికల్ల వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయం అన్నారు అశోక్ గజపతిరాజు.. బీజేపీ, జనసేనతో పొత్తు ఉంది.. వారందరిలో కూడా ధైర్యాన్ని నింపండి.. గజపతినగరంలో టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిధులు లేక సర్పంచులు అందరూ గగ్గోలు పెడుతున్నారు.. వికేంద్రీకరణ రావాలి.. వికేంద్రీకరణ నవ్వులు పలు కాకూడదు అన్నారు. ఈ ఐదేళ్లలో పాఠశాలల్లో విద్యార్థులు గణ నేయంగా తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలి ఏట 6 లక్షల యాబై వేల మందికి, రెండో ఏట నాలుగు లక్షల మంది విద్యార్థులు బడి బయట ఉన్నారు.. ప్రాథమిక విద్యకు దూరం అవుతున్నారు.. ప్రాథమిక విద్య లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు.