Dharmana Prasada Rao: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నదమ్ముడుగా ఉండి మీకు సహాయం చేస్తే ఓటేస్తారా..? ద్రోహం చేస్తారా..? అని ప్రశ్నించారు మంత్రి ధర్మానప్రసాదరావు.. జగన్‌కు ద్రోహం చేసేవారిని ఏం అనాలి అని మండిపడ్డారు.. జగన్ తీసుకొచ్చిన ప్రతి పథకంలో ఓ ఐడియాలజీ ఉందన్న ఆయన.. వృద్ధులంతా ప్రశాంతంగా ఉన్నారు.. ఇళ్లల్లో గోడవల్లేవు.. పిల్లల కోసం స్కూల్స్ లో సమూల మార్పులు చేశామని వెల్లడించారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అని మేం చెప్పాలా..? చెప్పక్కర్లేదు కదా? అని సభిలకును ప్రశ్నించారు. మీ చేతులను నరికేసుకుంటారా..? చేతులకు బలం చేకూర్చే ప్రభుత్వం తెచ్చుకుంటారా..? అనేది మీ చేతుల్లోనే ఉందన్నారు.
Read Also: Aamir Khan: ఆమెతో శృంగారం.. అందుకే విడాకులు.. మాజీ భార్య కీలక వ్యాఖ్యలు
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన.. హామీలు ఇచ్చి ఎగ్గోట్టే పెద్దమనిషి.. ఇప్పుడు కోత్తమోసాలతో వస్తున్నాడు అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఆయన.. చంద్రబాబు మాయలో పడోద్దు అని సూచించారు. ఆయనెప్పుడు నిజం మాట్లడరు.. ఆయన్ను గెలిపిస్తే బోడి గుండె మిగులుద్ది అంటూ హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు గౌరవంగా బ్రతికే అవకాశం వచ్చింది.. అర్హతున్న వారందరికీ పార్టీలతో సంబంధం లేకుండా పథకాలు ఇస్తున్నాం అని పేర్కొన్నారు. ఎవ్వరికీ నయా పైసా లంచం ఇవ్వకుండా పథకాలు అందజేస్తున్నాం అని తెలిపారు. మా హయాంలో.. మీ బిడ్డ ప్రభుత్వంలో.. మీకు మంచి జరిగిందనే భావిస్తేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్న దమ్మున్న లీడర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కడే అని వెల్లడించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.