కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుకపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేత మాచాని సోమనాథ్. మాచాని సోమప్ప ఎక్కడైతే అభివృద్ధిని వదిలేసారో.. వాటన్నిటిని ముందుకు తీసుకెళ్తానని, చేనేత అభివృద్ధికి పాటుపడుతానని ఇటీవల చేనేత ఆత్మీయ సమ్మేళన సభలో బుట్టా రేణుక చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు.
ఇవాళ ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలంలోని 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రంగాపురం- అర్ధవీడు రోడ్డు నిర్మాణానికి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి శంకుస్థాపన చేశారు.
నెల్లూరులో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుతో పాటు జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, మేయర్ స్రవంతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
గతంలో బైబై పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్ ఏర్పాటు చేసినట్టుగానే.. ఇప్పుడు మరో 73 రోజుల్లో తిరిగి అధికారంలోకి వస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ''జగన్ అనే నేను'' పేరుతో కౌంట్‌డౌన్ క్లాక్‌లు ఏర్పాటు చేశారు..