ఇవాళ ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలంలోని 25 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రంగాపురం- అర్ధవీడు రోడ్డు నిర్మాణానికి గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి, ఎంపీపీ వెంకట్రావు, జడ్పిటీసీ సభ్యులు చెన్ను విజయ, ఎక్స్ ఎంపీపీ రవికుమార్, రిటైర్డ్ డీఈ చేరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచి నాగిరెడ్డి, ఎంపీటీసీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: NTR-Bharata Ratna: కేంద్ర కేబినెట్ చివరి భేటీ.. ఎన్టీఆర్కు భారతరత్న?
ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మరోసారి విజయం సాధించబోతున్నారు అని పేర్కొన్నారు. గిద్దలూరు నియోజకవర్గం అభివృద్దిలో దూసుకుపోవాలంటే వైసీపీని గెలిపించాలని కోరారు. కాగా, నియోజకవర్గంలో డెవలప్మెంట్ కొనసాగాలంటే వైసీపీనే మరోసారి విజయం సాధించాలి అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిలో విశ్వసనీయత లేదు.. వాళ్లు కేవలం అధికారం కోసమే ఎన్నో అబద్దపు హామీలు ఇస్తారని కేపీ నాగార్జున రెడ్డి చెప్పుకొచ్చారు. వారి మాటలు నమ్మినే మనకు ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు.