Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డిపై సెటైర్లు వేశారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోమిరెడ్డికి రెండో జాబితాలో కూడా టికెట్ రాలేదు.. టికెట్ రాకపోతే చంద్రబాబును తిట్టాలి. ఆయన మీద బాధపడాలి.. కానీ, నామీద పోరాడానని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెబుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక, నా మీద పోరాడేందుకు సోమిరెడ్డి సరిపోడు.. ప్రజల కోసం.. పార్టీ కోసం బతికానని చెబుతున్నారు. ప్రజలను ఆయన దోచుకున్నారని దుయ్యబట్టారు. సోమిరెడ్డి పట్ల చంద్రబాబు చాలా ఉదారంగా వ్యవహరించారు.. గత ఎన్నికల్లో ఓటమిపాలైనా ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారన్న ఆయన.. సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డిని వదిలించుకున్నారని.. కానీ, పార్టీ నాలుగు సార్లు అవకాశం ఇచ్చిందని గుర్తుచేశారు.
Read Also: Sreemukhi: సీరియల్ హీరోతో శ్రీముఖి ప్రేమాయణం.. స్టేజిమీదే ప్రపోజ్.. ?
ప్రజలు వదిలించుకున్న నేతను తాము కూడా వదిలించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందన్నారు మంత్రి కాకాణి.. సోమిరెడ్డికి టికెట్ రాకపోతే నామీద బాధపడి బురద చెల్లుతున్నారు.. నేనేమీ సోమిరెడ్డికి టికెట్ ఇవ్వలేను కదా..? అని ప్రశ్నించారు. నన్ను విమర్శించడం సమంజసం కాదు అని సోమిరెడ్డికి హితవుపలికారు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. కాగా, టీడీపీ ఇప్పటికే రెండో జాబితాలను ప్రకటించినా.. పలువురు సీనియర్ నేతలకు టికెట్ దక్కలేదు.. దీంతో, కొందరు నేతలు చంద్రబాబును కలుస్తుండగా.. మరికొందరు నేతలు సైలెంట్‌గా పరిస్థితులను గమనిస్తున్నారు.