Vanteru Venugopal Reddy: ఎన్నికల తరుణంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గానిక చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వైసీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు వేణుగోపాల్ రెడ్డి.. పది సంవత్సరాలు వైసీపీలో ఉంటే కార్యకర్త కన్నా హీనంగా చూశారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.. కావలి, ఉదయగిరిలో వైసీపీ అభ్యర్ధుల గెలుపుకోసం గతంలో శక్తివంచన లేకుండా పనిచేశా.. కానీ, ఆ తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు మాకు దూరం అయ్యారని తెలిపారు. ఇక, నన్ను పార్టీ పట్టించుకోవడం లేదు.. కార్యకర్త కంటే హీనంగా చూశారు.. దీంతో, ఆత్మాభిమానం చంపుకుని ఉండలేకే వైసీపీ రాజీనామా చేసినట్టు వెల్లడించారు. అంతేకాదు.. తనకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.. అయితే, ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తాను అన్నారు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి.
Read Also: Mix Up : ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?