Thikka Reddy: టీడీపీ టికెట్ల కేటాయింపు కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చుపెడుతోంది.. కర్నూలు జిల్లా మంత్రాలయంల టీడీపీలో అసమ్మతి భగ్గుమంది.. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న తిక్కారెడ్డికి టికెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ.. ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు, తిక్కారెడ్డి అభిమానులు.. రోడ్లపై బైఠాయించి నిరసనలు చేపట్టారు. రహదారులపై టైర్లు దగ్ధం చేసి నిరసనకు దిగారు. మరోవైపు.. మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న పి తిక్కారెడ్డికి టికెట్ కేటాయించక పోవడంతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Weather warning: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు.. ఈ తేదీల్లో వర్షాలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తిక్కారెడ్డి.. చంద్రబాబు మంత్రాలయం టీడీపీ టికెట్ విషయంలో పునరాలోచించాలని సూచించారు. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇక, చంద్రబాబు కార్యాలయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రోకర్లు ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు డబ్బులకు అమ్ముడు పోయి.. వైఎస్ జగన్ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. త్వరలో 500 వాహనాలలో చంద్రబాబు దగ్గరకు బల ప్రదర్శనకు సిద్ధమన్నారు. టికెట్ కేటాయించిన బీసీ నేత రాఘవేంద్ర రెడ్డికి ఓటు వేస్తే బాలనాగిరెడ్డికి వేసినట్లే అని విమర్శించారు. బాలనాగిరెడ్డికి కోవర్టుగా రాఘవేంద్ర రెడ్డి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. మూడు నెలలు ముందుగానే మా ప్రత్యర్థి బాలనాగిరెడ్డి.. టీడీపీ టికెట్ బీసీలకే కేటాయించారని ఉపన్యాసంలో చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ మంత్రాలయం ఇంచార్జ్ తిక్కారెడ్డి.