నంద్యాల జిల్లా డోన్‌లో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో 500 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరాయి.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేతలు ఘాటు వ్యాఖ్యులు చేస్తున్నారు. ఈ సారి గెలుపు వైసీదేనని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు.
లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు.
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు విపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆయన.. జనసేన వేరే పార్టీలో కలవడం కాదు త్వరలోనే క్లోజ్ అయిపోతుందని జోస్యం చెప్పారు.. పిఠాపురంలో వైసీపీకి సునాయాసంగా ఉంటుందన్న ఆయన.. సినిమావాళ్లు అతీతులు కాదు.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా…