మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు.