YS Jagan: గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి లతోపాటు మరికొందరు చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణ గురువారం జరగాల్సిన నేపథ్యంలో దానిని కొన్ని కారణాల వల్ల శుక్రవారంకి వాయిదా వేసింది. సింగయ్య మృతికి సంబంధించిన ఘటనపై న్యాయమూర్తి డా. జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also:Lover Entry In Marriage: సినిమా రేంజ్‌లో పెళ్లికి హాజరైన ప్రియుడు.. చివరకు..?
ఇదివరకు కేసు విచారణకు రాగా, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తమ వాదనలు వినిపించారు. ఈ వాదనలో ఆయన పూర్తి వివరాలను సమర్పించేందుకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. అయితే ఈ కేసులో కొన్ని సార్లు తాను, మరికొన్ని వ్యాజ్యాల సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తారని అన్నారు. దీనితో జగన్ తోపాటు తదితరుల వ్యాజ్యాలపై కూడా విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ అభ్యర్థనను పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు వ్యతిరేకించారు. దీనితో మొత్తంగా నేడు ఈ కేసు క్వాష్ చేయాలని దాఖలైన 5 పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Read Also:Body Found In Drum: డ్రమ్‌లో కుళ్ళిపోయిన మృతదేహం.. కొనసాగుతున్న పోలీసుల విచారణ