YS Jagan Pulivendula Tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సారి తను ప్రాతినిథ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గం పర్యటనకు సిద్ధమయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు జగన్.. 25వ తేదీ మధ్యాహ్నం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో రాత్రి 7 గంటల వరకు ప్రజా దర్భార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 26న ఉదయం పులివెందుల వాసవి ఫంక్షన్ హాల్లో…
Off The Record: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఇప్పట్నుంచే సిద్ధమవుతోందా? అందుకోసం పార్టీ అధ్యక్షుడు జగన్ స్వయంగా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారా? సీరియస్ నిర్ణయాలు ఉంటాయని కొందరు ముఖ్య నాయకులకు వార్నింగ్స్ కూడా వెళ్ళిపోయాయా? ఇంతకీ ఏం చేస్తున్నారు వైసీపీ ప్రెసిడెంట్? నాయకులకు డైరెక్ట్ హెచ్చరికల వెనకున్న కారణాలేంటి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందా..
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు.
Gautam Reddy: తనకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పూనూరి గౌతమ్‌రెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసేందుకు వచ్చిన పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్‌రెడ్డి.. మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉండే విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగటం సరికాదు అన్నారు.. ప్రశాంతంగా ఉండే నగరాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారా..? అని మండిపడ్డారు.. నా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి…
Gautam Reddy Car Fire: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతమ్ రెడ్డి కారుపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడలోని గౌతమ్ రెడ్డి నివాసం సమీపంలో పార్క్ చేసి ఉంచిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తి.. ఆ తర్వాత అక్కడి నుంచి పరిపోయాడు.. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, ఓ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ, ఓ బ్యాగ్‌తో అక్కడికి…
తుఫాన్ కారణంగా కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని వైసీపీ మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని.. ఆయన అభిప్రాయం ఇప్పటికీ మారలేదన్నారు. నష్టపోయిన రైతులను పట్టించుకోకుండా మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లారని విమర్శించారు. చంద్రబాబు పాలనకు ఒక డైరెక్షన్ ఉందా?.. డైవర్షన్ కోసమే పాలన చేస్తున్నారా? అని వేణుగోపాల్ ఫైర్ అయ్యారు. ఈ రోజు మాజీమంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతుల…
Jogi Ramesh PA: ఇవాళ ఉదయం జోగి రమేష్‌తో పాటు పీఏ ఆరేపల్లి రామును అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఉదయం 12 గంటల సమయంలో జోగి పీఏ ఆరేపల్లి రామును బయటకు వదిలి పెట్టారు.
YCP Protests: నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం, కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
YS Jagan: జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు షరతులతో కూడిన అనుమతి లభించింది. రూట్ మార్చి..18 కండీషన్లతో పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసులు ప్రతిపాదించిన మార్గంలోనే జగన్ పర్యటన నిర్వహించేందుకు వైసీపీ నాయకత్వం అంగీకరించింది. ఈ అంశంపై మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడారు. "జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది. స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు.