YS Jagan Governor Meeting: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‌కు వెళ్లి.. గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్‌కు వైఎస్ జగన్ వివరించనున్నారు. అలానే కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతల అరాచకాలపై కంప్లైంట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Rishabh Pant: దేశం కోసం చేద్దాం గయ్స్.. టీమిండియాకు రిషబ్ పంత్ మెసేజ్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వారం రోజుల గ్యాప్ తరువాత ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు. అధినేత కేంద్ర కార్యాలయంలో కలిసిన పలువురు పార్టీ ముఖ్య నేతలు జగన్‌ను కలిశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ప్రభుత్వం తదుపరి చర్యలు ఎలా ఉన్నా.. మనకు ప్లస్ అవుతుందని నేతలతో జగన్ చెప్పారట. అందులో భాగంగానే వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.