Jagan Tour: మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన అనుమతులుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కమిషనర్ సిటీ పరిధిలో పరిమితులతో కూడిన అనుమతి ఇచ్చారు. జగన్ సహా 10 వాహనాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేషనల్ హైవే మీద వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. రోడ్ షోలు, జన సమీకరణ చేస్తే పర్యటనను అర్ధాంతరంగా నిలిపివేస్తామని షరతులు విధించారు.. రోడ్డు మార్గంలో జగన్ నర్సీపట్నం వెళ్లేందుకు…
Pilli Subhash Chandra Bose: పులివెందుల, ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలపై అందరికీ నమ్మకం పోయింది.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై నమ్మకం లేదు.. బీజేపీ మినహా అని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వెల్లడించారు.
YS Jagan Governor Meeting: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరికాసేపట్లో ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్తో సమావేశం కానున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్కు వెళ్లి.. గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను గవర్నర్కు వైఎస్ జగన్ వివరించనున్నారు. అలానే కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతల అరాచకాలపై కంప్లైంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. Also Read: Rishabh Pant: దేశం కోసం…
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయాలు లేకపోగా, శరవేగంగా అప్పులు పెరగటంపై జగన్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కాగ్ నివేదికను తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ (ట్వీట్టర్)లో పోస్ట్ చేశాడు.
YS Jagan: గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి లతోపాటు మరికొందరు చేసిన దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తదుపరి విచారణ గురువారం జరగాల్సిన నేపథ్యంలో దానిని కొన్ని కారణాల వల్ల శుక్రవారంకి వాయిదా వేసింది. సింగయ్య మృతికి సంబంధించిన ఘటనపై న్యాయమూర్తి డా. జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also:Lover Entry…
మహానాడు పెద్ద డ్రామా, చంద్రబాబు నాయుడు మహానాడులో ఫొటోలకు ఫోజులు ఇస్తున్నాడని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని వైసీపీ అధినేత ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలిపారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారన్నారు.
వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు.