Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మూడున్నరేళ్లలో నిర్మించిన ఇళ్లు కేవలం 8 శాతమేనని.. పీఎంఏవై ఇళ్లు కేవలం 5 శాతం మాత్రమే నిర్మించారని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇచ్చిన నిధుల నుంచి రూ.1,547 కోట్లు పక్కకు మళ్లించారన్నారు. సమీక్షల్లో వాస్తవాలను తొక్కిపెడుతున్నారని.. నవరత్నాలు –…
Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఆదివారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి బాధాకరమన్నారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక నాయకులు. అధికారులతో సమస్యను తెలుసుకుని కలెక్టర్‌తో వరద పరిస్థితిపై సమీక్షించామని బాలకృష్ణ తెలిపారు. కొట్నూరు, శ్రీకంఠాపురం, పూలకుంట సమీపంలో బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని…
CPI Narayana: విజయవాడలో సీపీఐ 24వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ మహాసభల్లో అమరావతికి మద్దతుగా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏపీకి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముప్పాళ్ల నాగేశ్వరరావు తీర్మానాన్ని 29 రాష్ట్రాల ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి సత్వరమే అమరావతి నిర్మాణం కొనసాగించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. 17…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మారుస్తూ.. అసెంబ్లీలో మంత్రి విడుదల రజిని తీర్మానం ప్రవేశపెట్టడం.. ఆ తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. అయితే, ఈ పరిణామాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.. అసలు, పేరు మార్చి సాధించేది ఏమిటి? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వివాదాలు సృష్టించాలని…
Devineni Uma: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇచ్చిన వినతి పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని దౌర్భాగ్య, నిస్సహాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గుచేటు అని ఆరోపించారు. 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా విభజన హామీలను వైసీపీ నేతలు సాధించలేకపోతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరవయ్యారని.. పోలవరం…
Hindupuram MLA Balakrishna: హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో బుధవారం నాడు టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పనిచేశారని.. ఆయన సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి.. ఏం మొహం పెట్టుకుని జెండా ఆవిష్కరణకు వచ్చారని ప్రశ్నించారు . టీడీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకుంటే పోలీసులు…
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. కోస్తా, ఆంధ్ర, గోదావరి జోన్ల బీజేపీ పదాధికారుల సమావేశంలో సునీల్ ధియోధర్‌తో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.. అసలు వైసీపీ ప్రభుత్వం తోలు మందం ప్రభుత్వం.. బుర్రలేని ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు.. నేచుర్ క్యూర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఇళ్ళ పట్టాల పేరుతో ఈ ప్రభుత్వం నిర్వీర్యం…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి గ్యాంగ్ కొండల్ని తవ్వేసి చెరువులుగా చేసేస్తున్నారు. చెట్లని కొట్టేస్తే పెంచొచ్చు.. కొండల్ని తవ్వేస్తే ఎలా అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. విశాఖలోని రుషికొండను ఇష్టం వచ్చినట్లు తవ్వేశారని.. విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండను ధ్వంసం చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. రుషికొండను తవ్వొద్దంటూ ఎన్జీటీ ఆదేశాలపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని.. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి కూడా అంతుబట్టని విధంగా రవ్వల కొండను తవ్వేశారని ఆవేదన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు.. రూ. 48 వేల కోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆయన.. రూ. 48 వేల కోట్ల దుర్వినియోగంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పులు – అవివీతి తప్ప మరేం జరగలేదన్న ఆయన.. ప్రభుత్వం చెప్పుకున్న స్థాయిలో సంక్షేమానికి పెద్దగా ఖర్చు పెడుతోందేంలేదన్నారు.. కోర్టుల తీర్పులపై సభలో చర్చలు…
మాన్సాస్ ట్రస్ట్ వివాదంలో రోజుకో కొత్త ట్విస్ట్ అనే తరహాలో కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది… తాజా గా ఆనంద గజపతిరాజు రెండో భార్య కుమార్తె ఊర్మిళ గజపతి రాజు తనను ఛైర్మన్‌గా నియమించాలంటున్నారు.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు ఊర్మిళ.. మొదటి భార్య కుమార్తె సంచయితను ఇటీవలే హైకోర్టు ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే కాగా.. తాజాగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం.. ఊర్మిళను, సంచయితను వారసులుగా గుర్తించినట్లు కోర్టుకు తెలిపారు…